Friday, April 01, 2011

ఏప్రియల్ ఒకటి !


ఈ రోజున అదేమిటో నిజం చెప్పినా నమ్మరు. మేం స్కూల్లో చదువుకొనే రోజుల్లో
పరీక్షలయిపోయి శెలవు లిచ్చే ఆఖరి రోజున ఒకరిపై ఒకరు పెన్నులతో ఇంకు
చల్లుకొనేవారు. అప్పటికాలంలో బాల్ పాయింట్ పెన్నులు అంత వాడకంలోనికి
రాక పోవడం, వచ్చినా కొత్తలో వాటి వాడకాన్ని స్కూళ్లలో అనిమింతచక పోవడం
ఆ ఇబ్బంది వుండేది. ఏప్రియల్ ఒకటి ని ఆల్ ఫూల్స్ డే గా అనటం వల్ల, పత్రికలు
కూడా పాఠకులతో మొదటిపేజీలో ఓ సంచలన వార్త వేసి ఫలానా పేజీ చూడండి
అని వ్రాసేవారు. నిజానికి ఆ నెంబరుగల పేజీ ఆ పత్రికలో అసలు వుండేదే కాదు.
మీడియా ఇలా బొల్తా కొట్టించడం విదేశాల్లో కూడా ఎప్పటి నుంచో వుంది. ఈ
సంప్రదాయాన్ని అక్కడినుంచే మనం దిగుమతి చేసుకొన్నాం, మన పుట్టిన రోజు
వేడుకలకు కేకు కోసి దీపాలార్పినట్లు! అమెరికాలోజోయీ స్కాగ్స్ అనే ప్రాక్టికల్
జోకర్. 2000 సంవత్సరంలో పత్రికలలో, న్యూయార్క్ లో ఏప్రియల్ ఫూల్స్
డే పెరేడ్ 12 గంటలకు 59వ నంబరు వీధి నుంచిజరుగుతుందనీ ప్రకటన ఇచ్చాడు.
ఆ పెరేడ్లో న్యూయార్క్, లాస్ ఏంజెలిస్,సియాటిల్ పోలీసు శాఖలు శకట ప్రదర్శనలో
పాల్గొంటాయని చెప్పాడు. ఆ ప్రకటన చూసి నమ్మేసిన సీ ఎన్ ఎన్ టీవీ చానల్ తన
ప్రతినిధులను చిత్రీకరించడానికి 59 స్ట్రీట్ కు పంపింది..తీరా అక్కడికి వెళ్ళాక తెలిసింది
ఆ రోజు ఏప్రియల్ ఒకటి అనీ, జోయీ ఏప్రియల్ ఫూల్ జోకు పేల్చాడని.సుప్రసిద్ధ రచయిత
మార్కట్వైన్, " సంవంత్సరమంతా మనమేమిటో ఏప్రియల్ ఒకటిన మనం గుర్తు చేసు
కొంటాం " అని చమత్కరించారు. ఆ రోజున మనం ఫూల్స్ఐతే అంతగా బాధ పడాల్సిన
అవసరం లేదు. ఏప్రియల్ ఒకటి గురించి రకరకాల కధలు చెబుతారు. ప్రళయకాలంలో
భూగోళమంతా మునిగిపోతున్నప్పుడు నోవా అనే ఆయన ఓ పడవ నిర్మించి జంతుకోటి
నంతా అందులోకి ఎక్కించి ఇంకెవరు మిగిలున్నారో చూసిరమ్మని ఒక పావురాన్ని
పంపాడట. అది ఏం చెప్పకుండా రెక్కలూపుతూ తిరిగి వచ్చినప్పుడు నోవా ఫూలయ్యాడట!
నోవా అలా ఫూల్ అయ్యాడు కనుక ఆ రోజును ఫూల్స్ డే గా జరుపుకొంటారని అంటారు.
మరొక కధ ఏమిటంటే గ్రెగీరియన్ క్యాలెండర్ అమలులోకి రాకముందు కొత్త ఏడాది
ఏప్రియల్ ఒకటిన మొదలయ్యేదట.ఆ రోజుల్లో మార్చి 25 నుండి ఏప్రియల్ 1వరకు కొత్త
సంవత్సరాన్ని జరుపుకొనేవారు.కొందరు పాత క్యాలెండరు పద్ధతినే పాటించేవారు. ఇలాటి
వాళ్ళని ఆట పట్టించడానికి ఏప్రియల్ ఒకటిన విందులు, వినోదాలు ఏర్పరుస్తున్నట్లు
పిలచి మోసగించేవారట. ఖాళీ బహుమతి పెట్టెలను అందంగా తయారుచేసి అందజేసేవారు.
ఆ రకంగా ఫూల్స్ ని చేసి సంబరపడే వాళ్ళు. ఇలా ఏప్రియల్ ఫూల్ అలవాటయింది. ఐనా
మనని పాలించే వాళ్ళు ప్రతి ఐదేళ్ళకీ మనని ఫూల్ చేస్తునే వున్నారు. మనం ఫూల్సై
హాయిగా మరో ఐదేళ్లవరకు మరో సారి అవడానికి ఎదురుచూస్తూనే వుంటాం.అందుకు
ఏప్రియల్ ఒకటే అవసరమా ?!
<><><><><><><><><><><>
చిలిపి సరదా ప్రశ్న?!
అమ్మాయిలకీ, రైళ్ళకీ ఉన్న పోలిక ఏమిటో చెప్పండి ? ఇందులో ఏప్రియల్ ఫూల్
ఏం లేదు ! ఆలొచించండి !!
VVVVVVVVV
VVVVVVV
VVVVV
VVV
V
ఆమ్మాయి పాదాలకీ పట్టాలుంటాయి! రైళ్ళకీ పట్టాలుంటాయి!!

3 comments:

  1. హహ బావుందండీ...

    "ఐనా మనని పాలించే వాళ్ళు ప్రతి ఐదేళ్ళకీ మనని ఫూల్ చేస్తునే వున్నారు. మనం ఫూల్సై హాయిగా మరో ఐదేళ్లవరకు మరో సారి అవడానికి ఎదురుచూస్తూనే వుంటాం.అందుకు ఏప్రియల్ ఒకటే అవసరమా ?!"....ఈ కొసమెరుపు మాత్రం అదిరింది. :)

    ReplyDelete
  2. అమ్మా ఈరోజు ఏప్రిల్ ఫస్ట్...ఇవ్వాళ నిజం చెప్పారో అబద్ధం చెప్పారో మాకు
    అనవసరం...మేము చూడం...చూసినా నమ్మం...రేపు కలుద్దాం...

    ReplyDelete
  3. నిజమేనండి! అసలు ఈ ఏప్రియల్ ఒకటిన నేను మీ ఫ్లాటుకు వస్తే
    ఫ్లాటుదగ్గర పెట్టుకొని తరచు రాని ఈ అప్పారావు ఈ రోజొచ్చాడు!
    ఫాటు తీసి హలో "ఓ ఫైవుందా?" అని అడగడు గదా అని మీకు
    హనుమానం రావొచ్చు!! అందుకు ఈ రోజొస్తా!!

    ReplyDelete